*వెహికల్ కి ముందు వెనక ఆ స్టిక్కర్స్ ఉన్నాయా..... జాగ్రత్త వాళ్ళు పట్టుకుంటే వదలరంట...*


హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, వాహనాల పేపర్లు లేకుండా బైక్‌లపై కేవలం పోలీస్Police, ఆర్మీ(Army) డిఫెన్స్(Defense), ప్రెస్ (Press), ఎమ్మెల్యే(MLA), జీహెచ్‌ఎంసీ (Ghmc), డాక్టర్(Doctot), అడ్వకేట్(Advocate) అని స్టిక్కర్లు పెట్టుకొని రోడ్లపైకి వచ్చే నకిలీగాళ్లకు చెక్ పెట్టాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) నిర్ణయించారు.ఇలాంటి వాహనాలు జంటనగరాల పరిధిలో ఎక్కడ కనిపించినా ఆపి మరి ప్రత్యేకంగా తనిఖీలు(Special drive) చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రముఖుల వ్యక్తుల పేర్లతో, సమాజంలో గౌరవప్రదమైన హోదా కలిగిన వ్యక్తులు, సంస్థల పేరనును అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా వాహనాలపై తిరిగే వాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఎవరైనా వాహనంపై స్టిక్కర్ అంటించుకుంటే దానికి సంబంధించిన వ్యక్తిగత లేదంటే ప్రొఫెషనల్ గుర్తింపు కార్డును తప్పని సరిగా చూపిస్తేనే వదులుతామని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో వాహనంపై ఎలాంటి స్టిక్కర్ అంటించినప్పటికి సరైన ఐడీ కార్డు(Personal ID card), పర్సనల్ ఐడెంటిటి కార్డు(Professional ID card) లేకపోతే అలాంటి వాహనాల్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు గ్రేటర్ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వర్కవుట్ కావడం లేదు. రీసెంట్‌గా హైదరాబాద్ జూబ్లిహిల్స్ కారు ప్రమాద ఘటన తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఈ నకిలీ స్టిక్కర్లు తగిలించుకొని బైక్‌లు, కార్లలో తిరుగుతున్న వారిపై వెస్ట్‌ జోన్, సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సరైన ఆధారాలు చూపించని వాహనదారులపై సీఎంవీ నిబంధనల ఉల్లం

ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టడానికి ప్రధాన కారణం జూబ్లీహిల్స్‌లో రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో ఆ నేరం బోధన్ ఎమ్మెల్యే షకీల్ కారు అని వార్తలు వచ్చాయి. అందులో ఆయన కుమారుడే ఉన్నాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే మీడియాతో పాటు పోలీసులకు ఆ కారు తనది కాదని..ఎవరో తన పేరుతో తిరుగుతున్నారని చెప్పడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*