*ఎస్సిఆర్డబ్ల్యూఏ గాజువాక యూనిట్ సభ్యులకు నిత్యావసర సరుకులు,స్వీట్లు,గుర్తింపు కార్డుల పంపిణీ*
    గాజువాక - మార్చి 31, : జర్నలిస్టుల సంక్షేమమే           ద్యేయంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని ఎస్సిఆర్డబ్ల్యూఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు..స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉగాది సంబరాలు- 2022 లో భాగంగా గురువారం రాత్రి గాజువాకలోని ఓ ప్రయివేట్ హోటల్ లో గాజువాక యూనిట్ సభ్యులకు నిత్యావసర సరుకులు, మిఠాయిలతో పాటుగా అసోసియేషన్ గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లుగా జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు..అసోసియేషన్ సంక్షేమ ఫలాలు ఎక్కువ మంది జర్నలిస్టులకు అందివ్వాలనే లక్ష్యంతో  అసోసియేషన్ సేవలను గ్రేటర్ విశాఖ మొత్తం అందిస్తున్నామని అన్నారు..నలుమూలలా ఉన్న  జర్నలిస్టులకు అసోసియేషన్ లో సభ్యత్వం కల్పించి వెల్ఫేర్ అందిస్తున్నామని అన్నారు..

 అసోసియేషన్ తరపున అందించే ప్రతి సేవా కార్యక్రమంలో ఎందరో అందిస్తున్న సహాయ సహకారాలు ఉన్నాయన్నారు.  అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులకు సహాయపడడంలో  దొరికే ఆనందం మాటలతో చెప్పలేనిది అన్నారు.  తమ ఈ లక్ష్యానికి చేదోడుగా నిలుస్తున్న దాతలు , సామాజిక సంఘ సేవ ఆసక్తి పరులు,  ఇతరులు అందరికీ అసోసియేషన్ కృతజ్ఞతగా ఉంటుందన్నారు. నిబద్ధత క్రమశిక్షణలతో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు..

ఆ ప్రయత్నానికి  గాజువాక యూనిట్ సభ్యులు కూడా బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు..భవిష్యత్ లో జర్నలిస్టులకు ఎటువంటి కష్టం వచ్చినా అసోసియేషన్ పరమైన సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో ఎస్. సి.ఆర్.డబ్ల్యూ.ఏ కార్యదర్శి కాళ్ల సూర్య ప్రకాష్,ఉపాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్,నాయుడు ,గాజువాక యూనిట్ సభ్యులు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం