ఘనంగా పోలమాంబ అమ్మవారి రాటఆరిలోవ  :  జీవీఎంసీ  9 వార్డు, సంజయ్ గాంధీ కాలనీ గ్రామ దేవత      శ్రీ పోలమాంబ అమ్మవారి పంచ  రాత్రి జాతర మహోత్సవాలు ఈ నెల  8 నుండి  12 వరకు  జరుపు సందర్బంగా  ఆదివారం  అమ్మవారి పండుగ రాట మహోత్సవాన్ని  ఆలయ ధర్మకర్త కంచు మూర్తి నాగరాజు ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు  వి. ఎమ్. ఆర్. డి .ఏ చైర్ పర్సన్   విశాఖ తూర్పు   సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల వెంకట్రావు దంపతులు  , 9 వ వార్డు కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వాతి దాస్  దంపతులు   హాజరైన  అమ్మవారిని దర్శించుకుని  తీర్థ ప్రసాదాలు స్వీకరించారు . అనంతరం వారి చేతుల మీదుగా  పండుగ రాట వేశారు  .  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు  పోలమాంబ అమ్మవారిని దర్శించు కోవాలంటే ఆరిలోవ ప్రాంత ప్రజలు    దూరంగా వెళ్లవలసి వచ్చేదని ఇప్పుడు గ్రామ   గ్రామానికి  దేవతగా ప్రతి గ్రామంలో  అమ్మవారి దేవాలయాలు వెలిశాయని అన్నారు  . పధ్నాలుగు గ్రామాల దేవత  శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని  జాతరను  విజయవంతం చేయాలని కోరారు . కార్యక్రమంలో  ఆలయ ధర్మకర్త కంచు  మూర్తి నాగరాజు , ఆలయ అధ్యక్షులు  ఒమ్మి రాజు ఆలయ కమిటీ జాతర కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, సంజయ్ గాంధీ కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యులు  , మహిళలు పెద్ద సంఖ్యలో   పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు