** సింహాచలం అప్పన్న స్వామి సన్నిదిలో రాష్ట్ర బి. సీ వెల్ఫేర్ , సమాచార శాఖ మంత్రి **

 


విశాఖపట్నం, ఏప్రిల్ 17, టుడే న్యూస్: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలలో బాగంగా అదివారం సింహగిరిపై జరిగిన వినోదోత్సవం లో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పాల్గొని కొంతసేపు పల్లకి మోశారు. సింహాచలం ఎగ్జిక్యూటివ్ అధికారి ఎం.వి. సూర్యకళ గౌరవ మంత్రి వర్యులను స్వాగతించగా స్వామివారిని దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజల అనంతరం పండితులు వేద అశీర్వచనం గావించారు. ఇ.ఒ శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు ఇతర విషయాలను పరిశీలించి ముఖ్య మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి చర్చించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.తదుపరి మంత్రి చిన ముషిడివాడ శారదా పీఠం లో స్వరాపానందేంద్ర స్వామిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఉప సంచాలకుడు వి.మణిరామ్.కె. శ్రీ దేవి, జిల్లా బి. సి సంక్షేమాధికారిణి, బోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు