10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : నలుగురు స్మగ్లర్లు అరెస్టు


తిరుమల పాపనాశనం నుంచి అన్నదమ్ముల బండ వైపు వెళ్లే మార్గం లో  పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ  మేడా సుందరరావు ఆదేశాలు మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన టీమ్ శనివారం సాయంత్రం నుంచి పాపనాశనం నుంచి అన్న దమ్ముల బండ వైపు కూంబింగ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున కంగుమడుగు అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని టాస్క్ ఫోర్స్ బృందం చుట్టుముట్టే ప్రయత్నం చేసింది.  వారిలో కొందరు దుంగలు పడేసి పారిపోయారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని పట్టుకో గలిగారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన కుప్పుసామి నడిపయ్యన్ (45), చంద్రకుమార్ కుప్పుస్వామి(31),  కాశి (44), ఏలుమలై గోవిందన్ (21)లను అరెస్టు చేశారు. అక్కడ లభించిన 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం