సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం


విశాఖపట్నం,ఎన్ఎన్ఇ న్యూస్: నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమ సుందరరావు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు.

మహాకవి శ్రీశ్రీ 112 వ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యాన ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో శనివారం జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో కవులు రచయితలు హాజరయ్యారు. 

ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ కళా వేదికకు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ అందిస్తున్న మీడియా సహకారానికి కృతజ్ఞతగా ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆరవల్లి నరేంద్ర ఇతర ప్రతినిధులు పూలమాలవేసి దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు