*థామస్ కప్ గెలిచిన భారత జట్టును అభినందించిన గవర్నర్*


విజయవాడ,టుడే న్యూస్  : ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌లో తొలిసారి చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించిన లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలతో కూడిన భారత జట్టు మెరుగైన ఆటతీరును కనబరిచిందని ప్రశంసించారు. తుది పోరులో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా థామస్‌ కప్‌ను గెలుచుకోవడం భారత జట్టు గొప్ప విజయమని గవర్నర్ అన్నారు 

తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేసిన భారత జట్టు సభ్యులు అందరూ  ప్రశంసలకు అర్హులని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు