రాజాం లో ఆప్ కార్యాలయం ప్రారంభం


రాజాం, విజయనగరం జిల్లా, టుడే న్యూస్: అవినీతి రహిత పాలన కోసం ఉద్యమం లా ఏర్పడి రాజకీయాలు ద్వారా ప్రజలకు నిజమైన స్వపరిపాలన అందించాలనే లక్ష్యం తో ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ

జాతీయ స్థాయి లో ఆప్ ను విస్తరిస్తున్నది. ఈ తరుణంలో 2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో 175 స్థానాలకు ఆప్ తరఫున అభ్యర్థులు ను నిలబెట్టి రాష్ట్ర రాజకీయాలను సమూలం గా మార్చే పనిలో భాగం గా ప్రతి జిల్లాలో, నియోజకవర్గం లో ఆప్ వాలంటీర్లు పని చేస్తున్నారు. అందులో భాగం గా రాజాం నియోజకవర్గానికి ఆప్ ఇన్చార్జిగా నియమించబడిన డాక్టర్ పైల.ఎం.ఎం.ఆర్.ఆర్.ఆర్. ఎస్.కుమార్ గారి ఆధ్వర్యంలో ఆప్ కార్యాలయం స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజాం ఆటో వర్కర్స్ యూనియన్ కె. ఈశ్వరరావు, పారిశుద్ధ్య కార్మికురాలు ఎ.శారద లు రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయనగరం పార్లమెంట్ ఆప్ అభ్యర్థి నారు సింహాద్రి నాయుడు గారు, మాట్లాడుతూ,... అవినీతి రహిత రాజకీయ వ్యవస్థ కోసం ప్రజలు కదలాలి, ఢిల్లీ, పంజాబ్ తరహా పాలనను ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అందించాలని ఆప్ 175 స్థానాలకు పోటీ చేయబోతోంది. ఇక ప్రజలే ఎంపిక చేసుకోవాలి. అని పిలుపునిచ్చారు.  జిలా కన్వీనర్ కె.దయానంద్ గారు మాట్లాడుతూ ప్రజలు తలచు కుంటే రాజకీయ వ్యవస్థలో మార్పు తధ్యం కాబట్టి ఢిల్లీ తరహా పాలనకు ముందుకు రావాలని కోరారు జిలా ఇంచార్జి సీర రమేష్ గారు మాట్లాడుతూ కేజ్రీవాల్ గారు చేసిన అభివృద్ధిని, అప్పు లేని రాష్ట్రం గా తీర్చి దిద్దిన తీరును ప్రజలు గమనించాలని కోరారు. నియోజకవర్గ యూత్ లీడర్ శనపతి ఈశ్వర్ మాట్లాడుతూ యువత రాజకీయ ప్రక్షాళనకు నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండల ఇంచార్జి ఎ.వెంకటరమణ, రాజరత్నం లు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు