*మహానాడుకు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ కార్యకర్తలకు అభినందనలు* -


*పార్టీ రాష్ట్ర అధ్యక్షలు, తెలంగాణ: బక్కని నరసింహులు .

హైదరాబాద్, 29.05.22, ఆదివారం,  టుడే న్యూస్:  ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు లక్షలాదికగా తరలివచ్చిన తెలంగాణ కార్యకర్తలకు, నాయకులు నా అభినందనలు. ఇదే ఉత్సాహాన్ని భవిష్యత్ లోనూ కొనసాగించి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో తెలుపుదాం. తెలంగాణ నలుమూలల నుండి మహానాడుకు తరలివెల్లిన కార్యకర్తలను చూసి తెలంగాణలో పార్టీ బలం ఏంటో అన్ని పార్టీలకు చూపించాం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంతుంటుందో పాలకులకు అర్థమైంది. బలమైన శక్తిగా మళ్లీ తెలంగాణలో ఎదిగేందుకు ఇది దోహదపడుతుంది.  తెలంగాణ అభివృద్ధికై టీడీపీ ఎప్పుడూ అవసరమే. అధికారానికి దూరమై రెండు దశాబ్ధాలు కావస్తున్నా ఎక్కడా నిరాశ లేకుండా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న కార్యకర్తలు అనే దేవుళ్లకు అన్ని వెళలా రుణపడి ఉంటాం.ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*