*భారీ బైక్ ర్యాలీతో మొదలైన మినీమహానాడు*


*ఖమ్మం లో మినీమహానాడు సంధర్భంగా ప్రధాన రోడ్లన్నీ పసుపుమయం*

 ఖమ్మం,టుడే న్యూస్: నగరంలోని తెలుగుదేశం పార్టీ నలభై వసంతాల మినీమహానాడు కార్యక్రమం ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రంగ రంగ వైభవంగా బైపాస్ రోడ్ లోగల రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింలు గారు మరియు రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర నాయకులు హాజరైయ్యారు.

ముందుగా జిల్లా పార్టీ కార్యాలయంలో ని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సుమారు 200 ద్విచ్రవాహనాలతో భారీ బైక్ ర్యాలీ డి.జే పాటలతో మహిళల కోలాటాల మధ్య సన్నాయి రాగాలు జోడించి ఫెవిలియన్ గ్రౌండ్ నుండి భారీ జనసందోహంతో బైపాస్ లో గల ఎన్టీఆర్ సర్కిల్ వరకు  బైక్ ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకొగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నరు. ముఖ్యఅతిధులు గా వచ్చినటువంటి రాష్ట్రపార్టీ నాయకులు ముందుగా ప్రసంగించారు.తరువాత కళాకారుల బృందంచే ఆట పాటల తో అభిమానుల్లో ఉత్సాహం పెంపొందించారు.అనంతరం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ బక్కని నర్సింలు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చేసిన గుర్తు చేస్తూ  చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన వల్లనే రాష్ట్రం బాగుపడుతుందని మధ్యతరగతి కుటుంబాలు సైతం విదేశాల్లో స్థిరపడే విధంగా చేశారని తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించాలని టిడిపి పాలనలోనే అభివృద్ధి జరిగిందని కట్టిన ఆఫీసులు వేసిన రోడ్లు బాబు గారి హయాంలో వేసింది అని గుర్తు చేశారు. అనంతరం ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు గారు నాపై నమ్మకంతో ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షునిగా పదవి ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా సందర్భంగా వారి ఆలోచన మేరకే ఖమ్మం పార్లమెంట్ కమిటీ పని చేసిందని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఏ సందేహం వచ్చినా తుచ తప్పకుండా ఆ కార్యక్రమాన్ని  విజయవంతం చేశామని ఆర్టీసీ సమ్మె కు మద్దతుగా రైతులకు అండగా ప్రజలకు అధిక ధరల పెరుగుదల విషయంలో ఖమ్మం ప్రజలకు టిడిపి పార్టీ అండగా నిలబడి ధర్నాలు రాస్తారోకోలు దిష్టిబొమ్మ దహనలు అనేక కార్యక్రమాలు చేసి వివిధ కార్యాలయాల్లో మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. చివరిగా పిలవగానే భారీ ఎత్తున అభిమానులు హాజరై సభను విజయవంతం చేసినందుకు అభినందిస్తూ అలాగే తమ సభ్యత్వాలను తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. కూరపాటి వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు గారు పొలిట్బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం స మ భూపాల్ రెడ్డి జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు తెలుగురైతు అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్.కె అరిఫ్ జెక్కిలి ఐలయ్య యాదవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్  I TDP A.S హరి కట్రం స్వామి తెలుగు యువత పొగాకు జయరామ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్ గుత్తా సీతయ్య కనగాల సాంబశివరావు వల్లం కొండ వెంకట్రామయ్య నగర టీడీపీ అధ్యక్షుడు వడ్డె విజయ్ నాగండ్ల మురళి ఏనుకూరు ఎంపీపీ ఆరం వరలక్ష్మి సీతారాములు గుండప్నేని నాగేశ్వరావు ప్యారీస్ వెంకన్న మునగపాటి.సంపత్ గుడి పూడి నాగేశ్వరరావు మంకెన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు