*ఉపాధి హామీ కూలిలకు 131,8 కోట్లు భకాయిలు వెంటనే చేల్లించాలి*


దేవరాపల్లి, జూన్15,బుధవారం, టుడే న్యూస్: జిల్లా లోని పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ భకాయిలు వెంటనే చేల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు జిల్లాలోని ఉపాధి హమి కూలిలకు చేల్లించ వలసిన.131,8 కోట్లు పైబడి ఉన్న  భకాయిలు వెంటనే చేల్లించాలని కనీస వేతనాలు అమలు చేయాలని  సమ్మర్ ఎలవెన్స్ మంచినీళ్ళు తట్టగునపాపం,పారకు డబ్బులు ఇవ్వాలని  పాత పద్దతిలోనే పనులు కోనసాగించాలని  బుధవారం దేవరాపల్లి మండలం లోని ఉపాధి కూలీలు పనులు చేస్తున్న పలు గ్రామాలు తిరిగి వారిసమస్యలు  అడిగి తెలుగుకుని పని ప్రదేశంలో కూలీలు తో కంచాలు పట్టుకుని నిర్సన చేపాట్టారు అనంతరం వెంకన్న మాట్లాడారు మహత్మగాంది జాతీయ గ్రామీణ ఉపాధి హమి చట్ట ప్రకారం పని చేసిన కూలిలకు పదిహేను,రోజుల్లో బిల్లులు చేల్లించకపోతే పని చేయించిన ప్రభుత్వం పై కేసులు పెట్టుకునే అదికారం కూలిలకు ఉందన్నారు, జిల్లాలోని అచ్చుతాపురం 2,77 కోట్లు బుచ్చయ్యపేట 0,64 లక్షలు చీడికాడ 5,15 కోట్లు చోడవరం 3,51 కోట్లు దేవరాపల్లి 5,07 కోట్లు కె కోటపాడు.2,37 కోట్లు కశింకోట 2,51 కోట్లు కోటవురట్ల 7,31కోట్లు మాడుగుల 6,34 కోట్లు 0,03 నక్కపల్లి 4,66 కోట్లు  నర్సిపట్నం 17,99 కోట్లు నాతవరం 12,46 పరవాడ 6,45కోట్లు 1,14 కోట్లు  8,27.కోట్లు రావికమతం 5,96  కోట్లు రోలుగుంట10,35 కోట్లు యస్ రాయవరం 0,05 సబ్బవరం17,25 కోట్లు యలమంచిలి 5,47 కోట్లు చేల్లించవలసి ఉండగా మిగిలిన మండల్లో కూలిలకు బిల్లులు చేల్లించినట్లు ప్రభుత్వం చేబుతున్న కూలీలు ఎకౌంట్సులో జమ కాలేదని తెలిపారు  నిజానికి మే మొదటి వారం నుండి జిల్లా లోని 131 కోట్లు పైబడి జిల్లా లోని భకాయిలు ఉన్నాయని తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి మెటిరియల్ డబ్బులు కోసం పనిదినాలు ఎక్కవగా చూపించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిదులు దారి మళ్ళించడం మేటిరియల్ డబ్బులు కోసం కోంత మంది కోర్టుకు వెళ్ళడం రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా నమ్మకం పోయిందని తెలిపారు దీంతో కేంద్ర ప్రభుత్వం (NiC) నేషనల్ వైడ్ సాప్ట్ వైర్ తీసువచ్చి నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంభందం లేకుండానే కూలీలు ఎకౌంట్సులో డబ్బులు పడే విధంగా ప్రయత్నం చేస్తుందని తెలిపారు దీని వలన అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ములాటలు వలన కూలిలకు తివ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు, కేంధ్రప్రభుత్వం అయితే పూర్తిగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీయం చేయడం కోసం పూనుకుందని అందులో బాగంగానే సాఫ్టువేరు మార్పుచేయడం రెండు పూటల పని,అని చేప్పడం మేట్లును మార్పులు చేయడం సమ్మర్ ఎలవెన్సును ఎత్తేయడం బడ్జెట్ లో నిదులు కొరత విధించడం చేసిందని తెలిపారు, ఈ ఎండకి తట్టు కోలేక కూలీలు నాన అవస్థలు పడి పనిచేసిన కనీసం టెంట్లు సౌకర్యం కల్పించలేదని  పోని కొలతలు లేకుండా వేతనం 257 రూపాయలు ఇస్తారా అంటే అది లేదన్నారు మార్చి నుండి జూన్ వరకు ఎండాకాలంలో నేల గట్టిగా ఉంటుందని గునపాం గడ్డపార దిగదు కాబట్టి, సమ్మర్ అలవెన్సు ఇచ్చే వారని కానీ ఇప్పటి నుండి సమ్మర్ ఎలవెన్సు రద్దు చేస్తున్నామని జీవో ఇచ్చి రద్దు చేసెసారని అన్నారు దీనివలన కూలిలే ఈపనులు మాకు వద్దంటూ పనికి దూరం అయ్యెవిదంగా చేయడం కోసం ప్రభుత్వం పూనుకుంటుందని తెలిపారు, కూలీలు వందశాతం మట్టి పని చేస్తే నలపైశాతం మేటిరియల్ చార్జి రాష్ట్ర ప్రభుత్వం ఎకౌంటులో పడుతుందని అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూలీలను ఆదుకోనే బాద్యత లేదా అని ప్రశ్నించారు   

 కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ నెంబర్.17000 (31)ను రద్దు చేయాలి.ఉపాధి హామీ లో రెండు పూటల పని రద్దు చేయాలి.

 సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలి, పనిముట్లు టెంటు ఇవ్వాలి.

బకాయి వేతనాలు ఇచ్చేటప్పుడు వడ్డీతో కలిపి ఇవ్వాలి కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ కి 2 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని కుటుంబానికి 200 రోజులు పని రోజుకి 600 రూపాయల వేతనం ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న వారికి పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిఇవ్వాలని ప్రతి పది హేను రోజులకు కూలి ఇవ్వాలని,డిమాండ్ చేసారు ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పల్గోన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం