43 వార్డులో లబ్దిదరులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన కె కె రాజు

 

     అక్కయ్యపాలెం ,జూన్22, టుడే న్యూస్:  విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిది 43 వార్డు లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ కార్యక్రమం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో చేపట్టారు.

43 వార్డు కార్పొరేటర్ ఉష శ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె కె రాజు ముఖ్య అతిధి గా పాల్గోని ఆయన చేతుల మీదుగా  పలువురికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసారు.

   ఈ సందర్భంగా కె కె రాజు  మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చినప్పటికీ హామీలు నెరవేర్చడంలో విఫలమై పేదవాడి సొంత ఇంటి కల కల గానే మిగిలిపోయిందని, 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా  వైయస్ జగన్మోహన్ రెడ్డి  చేపట్టిన నాటి నుండి అర్హులైన  ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం చేసేందుకు  ఈ ప్రభుత్వం కృషి చేసిందని ఆయన అన్నారు. 43 వార్డు కు సంబందించి 1631 లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. 

 ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమురి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్,రత్నాకర్,పద్మావతి, రంజాన్ వల్లి, బాధ శ్రీనివాస్,ఖాదర్, బంగారమ్మ, ,రెవిన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం