జమ్మూ కశ్మీర్ భూకంపం..రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు


శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ్రతతో మధ్యాహ్న 1.05 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌, తజికిస్థాన్‌ సరిహద్దుల్లో ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది.భూమికి 202 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గురించినట్లు పేర్కొంది.

అయితే, ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం ఆందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ టెక్టోనిక్‌ ప్లేట్‌పై ఉంటుందని, తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం