*జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ పై స్పందించిన మాజీ శాసన సభ్యురాలు*


హైదరాబాద్ : సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూనా ఆవేదన వ్యక్తం చేశారు..తెలంగాణ లో ఆరేండ్ల పాపకు, మొదలుకొని అరవై ఏండ్ల బామ్మ వరకు రక్షణ లేకుండా పోయింది అని తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు...ఈ ఫార్మ్ హౌస్ దొర పాలనలో తెలంగాణ వ్యాప్తంగా రాష్టం నలుమూలల రోజుకో హత్యాచారం జరుగుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ కి చలనం లేదని తెలిపారు... తాజాగా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి వారం రోజులైనా నిందితులను పట్టుకునే దిక్కులేదని విమర్శించారు.

తెలంగాణ లో పరిస్థితి చూస్తుంటే ఉన్నోనికి ఒక న్యాయం... లేనోడికి మరో న్యాయం ల ఉంది...

తాజాగా జూబ్లీహిల్స్ పబ్ గ్యాంగ్ రేపులో టి.ఆర్.యస్ పార్టీకి చెందిన నాయకుల పిల్లలు ఉండటం వారి బంధువులు ఉండటం  మిత్రపక్షం అయినా MIM ఎమ్మెల్యేల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా కేసు విషయం లో ఇంత జాప్యం జరగడానికి కారణం అని ప్రశ్నించారు..ఎన్నో కలలు కానీ తెచ్చుకున్న ఈ బంగారు తెలంగాణలో మహిళలపై రోజుకో దారుణం.రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ, మత్తు పదార్ధాలు కు అడ్డాగా హైదరాబాద్ ను మారుస్తూ, నడి రోడ్డు పై పట్టపగలు ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా చేసిన కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే స్పందించి నేరస్థులు ఎంతటి వారైనా సరే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..సొంత పార్టీ నాయకుల పిల్లలు ఉండటం చేత నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు.. బాధిత మహిళకు కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాట్రగడ్డ ప్రసూనా..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*