*విద్యార్థులను కూడా వదలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.


*వెంటనే బస్ చార్జీల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని లేదా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం.*


పర్లపల్లి రవీందర్, TNSF రాష్ట్ర అధ్యక్షులు

పెంచిన బస్ చార్జీల వల్ల విద్యార్థుల పై పెను భారం పడుతుందని కావున పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ డిమాండ్ చేశారు..

ఈ సందర్భంగా పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థులకు బస్ చార్జీలు పెంచడంతో ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు భారం గా మారే అవకాశం ఉందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందినకాడికి దోచుకోవాలని దురుద్దేశంతో చివరికి విద్యార్థులను కూడా వదిలిపెట్టడం లేదని గతంలో 165/- రూపాయలు ఉన్న బస్ పాస్ ను 450 రూపాయలకి, 330/- రూపాయలు ఉన్న బస్ పాస్ కు ఇప్పుడు 1,350/- రూపాయలకి పెంచడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని, ఈ విధంగా విద్యార్థులు విద్యను దూరం చేసే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. పెంచిన బస్ చార్జీలను తగ్గిస్తూ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం