లంచం లేనిదే ఫైల్ కదలని కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ లు. పట్టుబడ్డ రాజాం ఎస్. టీ. ఓ.


       విజయనగరం,జూన్,13 ,టుడే న్యూస్:  విజయనగరం జిల్లా రాజాం ఎస్.టీ.ఓ. ఆఫీస్ లో సోమవారం ఏ. సి. బి అధికారులు దాడి చేసి ఎస్.టీ. ఓ. ను పట్టుకున్నారు. వివరాల లోకి వెళ్తే రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం ఎం.ఏ.ఓ పనిచేస్తున్న వ్యక్తి నుంచి        సి.ఎఫ్.ఎం.ఎస్ ద్వారా అప్లోడ్ చేసిన బిల్స్ అప్రూవల్స్ కోసం పదిహేను వేలు రూపాయలు లంచం ఇవ్వాలని ఎస్.టీ.ఓ. డిమాండ్ చేశారు.చివరకు పదివేలు రూపాయలకు బేరం కుదరగా ఎం.ఏ.ఓ. ఏ.సి.బి. డి.ఎస్.పి. ని అశ్రాయించారు. ఈ క్రమం లో ఎస్.టీ.ఓ.నగదు ముట్టచెబుతుండగా వలపన్ని అవినీతి నిరోధక అధికారులు పట్టుకున్నారు.ఈ విషయం పై స్థానికులు మాట్లాడుతూ రాజాం లో మరికొన్ని గవర్నమెంట్ ఆఫీస్ లు ఎన్నో ఈ విధంగా లంచాలతో నిత్యం ఎన్నో చేతులు మారుతూ వుంటున్నాయని వారిని కూడా ఈ విధంగా పట్టుకొని సామాన్యులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం