ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందంచడమే లక్ష్యం- కే కే రాజు అక్కయ్యపాలెం,జూన్17,టుడే న్యూస్: ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 43 వ వార్డ్   టి.సి పాలెం, వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ తో కలిసి ఈ రోజు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పావురాలను ఆకాశంలోకి వదిలారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై స్థానికులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

 కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు స్థానిక మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పేద ప్రజలకు చేతులు ఇచ్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్య ఉపాధి ఆరోగ్యం కల్పించే విధంగా సుపరి పాలన అందిస్తున్నారని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే కొంతమంది టిడిపి నాయకుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై  తప్పుడు ప్రచారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలని  సూచించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో

 డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారు, 14 వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారు, సాడి పద్మారెడ్డి, రేయి వెంకటరమణ, సేనాపతి అప్పారావు, నీలి రవి, సకల బత్తుల ప్రసాద్ రావు, షేక్ బాబ్జి,  రాయుడు శ్రీను, కె.పి రత్నాకర్,కిరణ్ రాజు,పైడి రమణ,హరి పట్నాయక్,కాయల శ్రీనివాస్, సురాబత్తుల తిరుపతిరావు, బాద.శ్రీనివాస్, కాయల రామారావు, దుప్పలపూడి శ్రీనివాస్, కంచు పద్మ శేఖర్,రంజాన్ వల్లి,లంక రాము,సూర్యారావు,బైర వెంకట్, సిర్రా లక్ష్మణ్, బంగారమ్మ,మట్టా రాణి, ఎస్.నరసయ్య,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*