*ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది- కె కె రాజు*
అక్కయ్య పాలెం, జూన్21,టుడే న్యూస్: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె.రాజు పేర్కొన్నారు.
ఈ మేరకు ఈ రోజు సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన జీవీఎంసీ 49వ వార్డు లో సాయిరామ్ నగర్ వద్ద నుండి కార్పొరేటర్ అల్లు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో కెకె.రాజు పాల్గొన్నారు. ఈసందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ లక్ష 75 కోట్ల రూపాయలు వచ్చించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు . గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నూతన ఉత్తేజాన్ని నింపిందని . ప్రజలు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ హారతులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటు మురి సతీష్ స్టాండింగ్ కమిటీ మెంబర్ వి.ప్రసాద్ కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారు,,రేయి వెంకటరమణ, కంటి పాము కామేశ్వరి, కిరణ్ రాజు,నీలి రవి, కె.పి రత్నాకర్,,పైడి రమణ, డైరెక్టర్ ఎన్.రవికుమార్, ఐ.రవికుమార్, నూకరాజు, వార్డ్ నాయకులు అది రెడ్డి శ్రీను, డిల్లీ రావు, చంద్రశేఖర్, విత్తనాల శివ, పావని సరస్వతమ్మ,సీనియర్ నాయకులు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.