అయ్యన్నకు హైకోర్టులో ఊరట


విశాఖపట్నం,జూన్21,టుడే న్యూస్


: మాజీ మంత్రి అయ్యన్న  పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను తక్షణం నిలిపివేయాని అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

ఆ సమయంలో కూల్చివేతలు చేపట్టడం ఏంటని అధికారులను నిలదీసింది. సూర్యాస్తమయం తరువాత కూల్చివేతలు చేపట్టరాదని న్యాయస్థానం మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించడం.. ఇదేం పద్ధతని అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీ రమేశ్‌ ఆదివారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారులు చింతకాయల విజయ్‌, రాజేశ్‌ ఆదివారం అత్యవసరంగా హైకోర్టులో (హౌజ్‌ మోషన్‌) పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపించారు. ‘‘అధికారులు ఆమోదించిన ప్లాన్‌కి అనుగుణంగానే పిటిషనర్లు ఇంటి నిర్మాణం చేశారు. ఇరిగేషన్‌ అధికారులు, తహశీల్దార్‌ హద్దులు నిర్ణయించాకే ఇంటి నిర్మాణం చేపట్టారు. కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా రాజకీయ కక్షతో, నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారు’’ అని వాదనలు వినిపించారు. న్యాయమూర్తి స్పందిస్తూ... అర్ధరాత్రి కూల్చివేతలు ఏంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘‘ఇప్పటికే కొంత భాగం ప్రహరీ గోడను కూల్చివేశారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు