తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం టీడీపీ -టీయెస్ ప్రోగ్రామింగ్ కమిటీ మాజీ కన్వీనర్ కీ!శే జి. బుచ్చిలింగం గారి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
విశాఖపట్నం,2024, మే 10, టుడే న్యూస్: ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. ‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరపిస్తారు. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలానిస్తాయని, అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక...
: హైదరాబాద్,2024, మే 8,టుడే న్యూస్: ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ ప్రముఖులు సిదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలకు ఓటమి తప్పదన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీగా విజయం సాధిస్తారన్నారు. అయితే ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ నాయకులు భూములు భారీగా కబ్జా చేశారని ఆరోపించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ లక్షా పదివేల ఓట్ల మేజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. కూటమికి సినిమా ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా వాళ్లు ముందుకు రావాలని ఈ సందర్బంగా నట్టి కుమార్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. చ...
మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. కళా రంగానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం విదితమే.