వ్యాయామంలో మెరుగైనది ' వాకింగ్'

 

విశాఖపట్నం, జూన్ 25 టుడే న్యస్


: అనుదినం మనం చేసే వ్యాయామాలన్నింటి లోనూ వాకింగ్ చాలా మెరుగైనదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. వాక ర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మంత్రి అమర్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడక నవరత్నాలుగా

గుర్తింపుపొందిన వారిని సన్మానించారు. ఈ సభలో మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ కోవిడ్

తరువాత ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల  శ్రద్ధ పెరిగిందని అన్నారు. 

విశాఖనగరంలో ఆళ్వార్ దాస్ పలు 

 వాకర్స్ క్లబ్ లను ఏర్పాటు చేశారని అన్నారు. ఆ క్లబ్ లు ఇప్పుడు లక్షలాది మందికి ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు.

ఈ కార్య క్రమంలో మంత్రి అమర్ నాథ్ను వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షలు ఎం.వి. నేతాజీ తదితరులు  పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*