నక్కవానిపాలెంలో విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం ..
ముఖ్య అతిథులుగా పలు బ్యాంకుల చైర్మన్లు హాజరు
బ్యాంకులో ఈ - కార్నర్ సౌకర్యం
విశాఖపట్నం, జూన్ 30, టుడే న్యూస్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50శాఖలు కలిగి, సహకార బ్యాంకుల్లోనే ముందుకు దూసుకుపోతున్న ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ మరో కొత్త బ్యాంకు భవనాన్ని సమకూర్చుకుంది. విశాఖ నగర నడిబొడ్డున నక్కవానిపాలెంలో గురువారం నూతన బ్యాంకు భవనాన్ని ఆ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్ర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ కనక మహాలక్ష్మీ బ్యాంకు చైర్మన్ పి.రఘునాథ రావు మాట్లాడుతూ విశాఖ బ్యాంకు పురోగతిని కొనియాడారు. మహారాజ బ్యాంకు చైర్మన్ ఎంఆర్కే రాజు మాట్లాడుతూ 50శాఖలు కలిగి ఉన్న విశాఖ బ్యాంకు ఇప్పటికే 14బ్యాంకులకు సొంత భవనాలు కలిగి ఉండడం గొప్పతనమేనన్నారు. షిప్ యార్డు బ్యాంకు అధ్యక్షులు ఎంఎస్ఎస్ గుప్తా మాట్లాడుతూ ఈ ఏడాది లక్షమంది సభ్యుల్ని చేర్చడమే లక్ష్యంగా విశాఖ బ్యాంకు పని చేస్తోందని కొనియాడారు. విశాఖ బ్యాంకు చైర్మన్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ రూ.7500కోట్ల టర్నోవర్ తో దూసుకుపోతున్న తమ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు, పేద, మధ్య తరగతి వారికి ఎన్నో విధాలా ఆసరాగా ఉంటుందన్నారు. ఇతర పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా తమ బ్యాంకు నిలుస్తోందని గర్వంగా చెప్పగలమన్నారు. ఈ-బ్యాంకింగ్ వ్యవస్థలో అధునాతన ఈ - కార్నర్ విభాగాన్ని కూడా నక్కవాని పాలెం బ్రాంచిలో ఏర్పాటు. చేశామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు గుడివాడ భాస్కరరావు ( వైస్ ప్రెసిడెంట్), కె.భవాని, చంద్రశేఖర్, ఎస్.రామచంద్ర రాజు, సీనియర్ వైస్ చైర్మన్ యూ.పార్వతీ దేవి, బ్యాంకు సీఈవో పీవీ నరసింహ మూర్తి, వివిధ బ్యాంకుల సీఈవోలు శ్యామ్ కుమార్, కుమార్, నాక్కవానిపాలెం విశాఖ కో-ఆప్ బ్యాంకు మేనేజర్ బీఎం మూర్తి తదితరులు పాల్గొన్నారు.