కొనసాగుతున్న "మహా ఉత్కంఠ"..
                ఉద్ధవ్ కు పవర్ కీలక సూచన!

ముంబయి: శివసేనలో అసమ్మతి బంగ్గుమనడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మంత్రి ఏక్ నాథ్ శిండే తన వర్గం ఎమ్మెల్యేల తో తిరుగుబావుటా ఎగురవేయడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్ అఘాడి ప్రభుత్వ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠక్రేతోఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం అయ్యరు.సుప్రియ సులే.. జితేంద్ర అవదు తో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన పవర్.. దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం పవర్,సుప్రియా సులేతో కలిసి తన నివాసం నుంచి బయటకు వచ్చిన సీఎం ఉద్ధవ్ తన మద్దతుదారులుకు అభివాదం చేశారు. అయితే, ఈ కీలక భేటీలో శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిండెను ముఖ్యమంత్రి చేయాలని శరద్ పవార్, కాంగ్రెస్ సూచించినట్లు తెలుస్తోంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*