ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తాం

విశాఖ పట్నం, జూన్ 9,టుడే న్యూస్: ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలియచేశారు. జలవనరుల శాఖ

మంత్రి అంబటి రాంబాబుతో కలిసి స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశాన్ని

 నిర్వహించారు. అనంతరం మంత్రి

అమర్ నాధ్ విలేఖరులతో మాట్లాడుతూ అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి ప్రకటించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటిదశ నిర్మాణ పనులు చేపట్టడానికి సర్వం సిద్ధంగా ఉన్నామని అన్నారు. జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు ఇప్పటికే కార్యోన్ముఖులై ఉన్నారని మంత్రి అమర్ తెలియచేశారు. దీనికి సంబంధించిన భూసేకరణ పనులను చేపట్టడానికి ప్రత్యేక అధికారిని కూడా నియమించారని చెప్పారు. భూసేకరణకు సంబంధించి చెల్లించ వలసిన నష్ట పరిహారం పై ప్రజలకు అనుకూలంగా చర్యలు తీసుకోనున్నామని ఆయన అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నా తెలియ చేశారు. ఇదిలా ఉండగా ఏలేరు, పోలవరం కాలువల మధ్య విసన్నపాలెం శివారు గ్రామమైన రామన్న పాలెం ఉందని ఈ కాలువలకు వరదలు వచ్చినకు తమ గ్రామాలు ముంపునకు గురువుతుంటా ఆ గ్రామస్తులు తమ దృష్టికి తీసుకవచ్చారనితీసుకవచ్చారని

దీనిపై జలవనుల శాఖ అధికారులతో చర్చించినట్లు మంత్రి అమర్ నాథ్ తెలిపారు. ఈ గ్రామాలను వేరే చోటకు తరలించాలి వస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్య తలెత్త నుందని ఈ సమావేశంలో చర్చకు వచ్చిందని దానికి బదులుగా ఈ కాలువలపై వంతెనలు నిర్మిస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయ పడ్డారని, అయితే ఎది తక్కువ ఖర్చుతో పూర్తయితే దాన్ని చేపట్టాలని అధికారులకు సూచించాలని మంత్రి అమర్ సూచించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం