*ప్రజా సంక్షేమమే మన ప్రభుత్వ లక్ష్యం.*

*గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కె కె రాజు*

   అక్కయ్యపాలెం,జూన్20,టుడే న్యూస్:  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  సుపరిపాలన అందిస్తున్నారని  విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు  అన్నారు.

   జీవీఎంసీ 43 వ వార్డు టి.సి.పాలెం వెంకటేశ్వర కాలనీ నందగిరి నగర్, తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన వార్డు  కార్పొరేటర్ ఉషశ్రీ తో కలసి ఆయన పర్యటించారు.

 కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరుపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రూపొందించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విశేష స్పందన లభిస్తుందని ఈ కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత నెల 15 రోజుల నుండి చేపడుతున్న గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో కొన్ని సమస్యలను గుర్తించామని అన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని పథకాలకు ఆటంకం కలిగిన మాట వాస్తవమేనని త్వరలో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల శ్రీనివాసరావు, రాయుడు శ్రీను, బొడ్డేటి గంగా మహేష్, వసంతల అప్పారావు, హరి పట్నాయక్, బొడ్డేటి కిరణ్, కాయల శ్రీనివాస్, సురాబత్తుల తిరుపతిరావు, బాద శ్రీనివాస్, దుప్పలపూడి శ్రీనివాస్, రంజాన్ వల్లి, బైర వెంకట్, ఎస్.నరసయ్య, ఇజ్జు సీతారాం యడ్ల శ్రీనివాసరావు, లంక రాము, రమణమ్మ, సుజాత, మరియు సీనియర్ నాయకులు, మహిళలు  సచివాలయం కార్యదర్శులు,  వాలంటిర్ లు   పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం