నిన్న ఫిర్యాదు...నేడు విచారణ...

 



స్పందన భేష్..

కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

విశాఖపట్నం,జూన్20: అగనంపూడి వయోవృద్ధుల భూ సమస్య పై ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాగం కదిలింది. సోమవారం నాడు బాధితులు స్పందనలో ఫిర్యాదు చేయగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్ డి ఓ షేక్ హుస్సేన్ సాహెబ్ వివాద స్థలాన్ని పరిశీలించారు.

రెవెన్యూ విభాగం అంటేనే ఎక్కడి ఫిర్యాదులు అక్కడే ఉంటాయని, సమస్యలు పరిష్కరించబడవని అపవాదు వుంది. కానీ ఇందుకు విరుద్ధంగా నిన్న ఫిర్యాదు చేస్తే నేడు విచారణ చేపట్టిన ఆర్టీఓ తీరును అభినందించాల్సిందే. అయ్యా మా..భూములు..మా కష్టార్జితం పోసి కొనుగోలు చేసిన భూములను లాగేసుకుంటున్నారు అంటూ అగనంపూడి ప్రాంతానికి చెందిన వయో వృద్ధులు సోమవారం జరిగిన స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించడమే కాక పరిష్కరించండని అంటూ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఆర్టీఓను అదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో విశాఖ ఆర్టీఓ గాజువాక ఎంఆర్‌ఓ స్థానిక సర్వేయర్లతో కలిసి మంగళవారం విచారణ చేపట్టారు. అదీ అధికారుల స్పీడ్‌ వివరాల్లోకి వెళితే...

గాజువాక మండలం అగనంపూడి రెవెన్యూ సర్వే నెంబరు 50/1లో ఒక ప్రైవేటు వ్యక్తి వేసిన లే అవుట్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసుకున్నామని తప్పుడు పత్రాలను సృష్టించి తమపై దౌర్జన్యం చేసి తాము నిర్మించుకున్న షెడ్లను అధికారుల పై ఒత్తిడి పెట్టి కూలగొట్టి అక్రమించేందుకు ఆర్టీఐ గోవిందు అనే గ్యాంగ్‌ ప్రయత్నిస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ ఇదే ప్రాంతానికి చెందిన వయోవృద్ధులు దాసరి ఆదినారాయణ, చుక్కా దుర్గారెడ్డి, మొదలవలస గోవిందరావులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌ మల్లికార్జున ఆర్టీఓను ఆదేశించడంతో ఆర్టీఓ షేక్‌హుస్సేన్‌ సాహెబ్‌తో పాటు ఎంఆర్‌ఓ లోకేశ్వరరావు, సర్వేయర్లు బృందం ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం సంబంధిత స్థలం వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. బాధితులకు తన పరిధికి లోబడి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. దీనిపై కోర్టు ఉత్తర్వులు వయోవృద్ధుల తరుపున ఉండడాన్ని రెవెన్యూ యంత్రాంగం గమనించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదుపై విచారణ జరిపామని దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎమ్మార్వో లోకేశ్వరావు ను ఆదేశించారు. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్రి వీర గోవిందుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు లేఖ రాస్తామని ఆయన తనను కలిసిన మీడియా ప్రతనిధులతో చెప్పారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు