*జగనన్న సంక్షేమ పథకాలు వెల్లువలా వస్తూనే ఉంటాయ్...*
*ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి*
వైఎస్ జగనన్న సంక్షేమ పథకాలు ఎప్పటిలాగే వెల్లువలా వస్తూనే వుంటాయని, ఎన్నటికీ అవి ఆగవు గాక ఆగవని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. అందుకే మళ్లీ జగనన్న ప్రభుత్వానికే అందరూ ఓట్లు వేయాలని పిలుపు నిచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక కొర్లగుంటలో జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, వాటి లక్ష్యాల గురించి తెలియజేశారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడేళ్లలోనే రాష్ట్రంలో
లక్షా 30 వేల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగానే అందించడం జరిగిందన్నారు. గడప గడపకు మేము వెళ్తుంటే వైఎస్ జగనన్న ఇవి మీకు ఇస్తున్న సంక్షేమ ఫలాలు అని చెబుతుంటే.... ప్రజలంతా అవునని, అందుకే చాలా ఆనందంగా ఉన్నామంటూ హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
జగనన్న తప్ప ఇంకెవరూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని వారు స్పష్టం చేస్తున్నారని వివరించారు. జగనన్న ప్రభుత్వం పట్ల ప్రజలకు చాలా నమ్మకం ఉందని స్పష్టం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్పందన కనిపిస్తోందని, అయితే కొద్ది మంది తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తులు మాత్రం మమ్మల్ని ప్రజలు అడ్డుకున్నట్లు గా ప్రచారాన్ని సృష్టిస్తున్నారని భూమన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, భూమన అభినయ్ పాల్గొన్నారు.