గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై విశేష స్పందన - కెకె.రాజు

 



విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో గత నాలుగు వారాల బట్టి చేపడుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విశేష స్పందన లభిస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె.రాజు పేర్కొన్నారు. ఈ మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 51 వ వార్డు పరిధి అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో వార్డ్ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ తో కలిసి పర్యటించారు. అంతకుముందు కూడలి వద్ద నున్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకి స్థానిక మహిళలు హారతులు పడుతూ పూలమాల వేశారు. అనంతరం వార్డు లో పర్యటించిన కేకే రాజు స్థానికుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు చేయూత నిచ్చే విధంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  కెకె.రాజు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని నాడు ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను నేరుగా తీసుకున్నారని దానికి అనుగుణంగా నేడు విద్య, వైద్యం, ఉపాధి ప్రతి పేదవాడికి అదేవిధంగా తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా కెకె.రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్  ,ఆల్లు శంకర్రావుగారు, అనీల్ కుమార్ రాజు , ఆళ్ల లీలావతి శ్రీనివాస్, పైడి శ్రీను, పైడి ప్రతాప్, ప్రసన్న రెడ్డి, యద్దు పైడి రాజు, మెట్ట దమయంతి, రాజంరాజు , విశ్వనాథ రాజు,  వై వరలక్ష్మీ, రత్నం, లత, దిద్ది రమేష్, సునీత, ధర్మవతి, రెయ్యి పైడి రాజు తదతరులు పోల్గోన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం