ఆర్మీ విద్యార్థుల కు అగ్నిపత్ విధానం తో ఆశలు ఆవిరైపోయాయి: జక్కలి ఐలయ్య యాదవ్

  హైదరాబాద్, జూన్19,టుడే న్యూస్: సైన్యంలో  కొత్త గా ప్రవేశపెట్టిన నియామక విధానం అగ్నిపత్ తో నష్ట పోతున్న పాత ఆర్మీ విద్యార్థుల  యువత భవిష్యత్ పై బారోసా  ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. సైన్యంలో చేరి దేశం కోసం పోరాడాలని కసితో వేలాది మంది యువత ఆర్మీ పెట్టిన పలు రకాల పరక్షలలో నెగ్గి చివరకు వ్రాత పరక్ష కోసం సన్నద్ధం మైన సమయంలో ఆర్మీ విద్యార్థుల కు అగ్నిపత్ విధానం తో  ఆశలు ఆవిరైపోయాయని పేర్కొన్నారు. ఆర్మీ పాత విద్యార్థి.యువతకు  హాల్ టికెట్ ఇచ్చి11 పర్యాయాలు పరీక్షలు రద్దు చేసినందున మళ్ళీ తేదీని నిర్ణయించి పరీక్ష  నిర్వహించి  సైన్యంలో చేర్చుకుని న్యాయం చేయాలన్నారు. సైన్యంలో తాత్కాలిక ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగ భద్రతపై  భరోసా లేనందున  సైన్యం పటిష్టత లోపిస్తోంద అనే అనుమానం  తో అగ్ని ప థ పై దేశ ప్రజలకు పార్టీలకు విద్యార్థులకు అనేక అనుమానాలు సందేహాలు ఉన్నందున వాటిని నివృత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ఇలాంటి సున్నితమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని  విజ్ఞప్తి చేశారు

 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*