చంద్రబాబుచే హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం.వెబ్ సైట్ లాంచింగ్
  హైదరాబాద్, జూన్28,టుడే న్యూస్:  మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల అసోసియేషన్ రూపకల్పన చేసిన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం ( www.100yearsofntr.com)   వెబ్ సైట్ ను తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా  ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజల చేత డిజిటల్ సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు మంగళ వారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద ఒక అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించి, ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ముఖ్యులకు అభినందనలు తెలిపారు. ఇంతటి కార్యక్రమాన్ని ఎంతో అంకిత భావంతో నిర్వహించడం వారికి ఎన్టీఆర్ మీద వున్న అభిమానానికి నిదర్శనమన్నారు. తెలుగు ప్రజల శక్తి, యుక్తి తెలుగు తేజం, ఆరాధ్య దైవం అయిన ఎన్టీఆర్  రేపటి తరమే కాదు, తరతరాలు  జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు  అని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రవిప్రసాద్, సెక్రటరీ తుమ్మల రమేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం