*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన: కె.కె రాజు*
విశాఖపట్నం,జూన్18,టుడే న్యూస్: ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి ఆరోగ్యం భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.
ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం లో 14 మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు సుమారు 5,23,000 రూపాయలు విలువగల చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. వైద్యం కోసం వెయ్యి రూపాయల పైబడిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ద్వార వైద్యం అందించేందుకు ఈ ప్రభుత్వం అవకాశం కల్పించిందని , ఆ వ్యాధి ఒకవేళ ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం లో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనూక్, అల్లు శంకర్ రావు, కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ళ శ్రీనివాస్,కిరణ్ రాజు,నీలి రవి, పైడి రమణ, రత్నాకర్, డైరెక్టర్స్ ఆళ్ళశివ గణేష్,రాయుడు శ్రీను, నూకరాజు, కిరణ్, షేక్ బాబ్జి రామలక్ష్మి, వరలక్ష్మి, సుశీల,అమ్మాజీ, ఆదిలక్ష్మి, రాజకుమారి, రాజేష్,సునీల్, తదితరులు పాల్గొన్నారు.