*ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరింది-శ్రీ కె కె రాజు *
అక్కయ్యపాలెం,జూన్21, టుడే న్యూస్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారని అందులో భాగంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో నేడు అర్హులకు ఇళ్ల పట్టాల తో పాటుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె కె. రాజు పేర్కొన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 44 వ వార్డు పరిధి అక్కయ్యపాలెం షాదీఖానా లో వార్డు కార్పొరేటర్ బాణాల శీను ఆధ్వర్యంలో సోమవారం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె కె.రాజు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా కె కె. రాజు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు కల్పిస్తామని ఆశ చూపి విఫలమయ్యారని అన్నారు. నాడు అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నిజం కావాలని పదవి బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అయితే టిడిపి నాయకులు కోర్టుల ద్వారా ప్రక్రియను అడ్డుకున్నారని ఆరోపించారు. నేడు ప్రతి పేదవాడికి ఏడు లక్షల నుండి పది లక్షల రూపాయల విలువ గల ఇంటి స్థలాలు అందించే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
పేదవాడికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారని అన్నారు. లబ్ధిదారునికి ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటుగా ఇంటి నిర్మాణానికి సంబంధించి లక్షా ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటుగ ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, జీవీఎంసీ జోన్ 5 కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజ్, హబీబ్ గోపి, రాంబాబు, సీతారామ్, కాయల రామారావు, తదితరులు పాల్గొన్నారు.