అనాథ నిరుపేద బాల బాలికల కు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2005 సంవత్సరం నుంచి ఉచిత విద్య:నారా భువనేశ్వరి
హైదరాబాద్, జూలై 3,టుడే న్యూస్: కృష్ణా జిల్లా చల్లపల్లి లోని ఎన్టీఆర్ ( NTR ) ఉన్నత పాఠశాలలో 6 , 7 , 8 , 9 తరగతుల్లో ఒక్కో దానిలో పది మంది చొప్పున 40 మంది కి ( DAY SCHOLAR ) ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు NTR Memorial Trust Managing Trustee శ్రీమతి నారా భువనేశ్వరి వెల్లడించారు. అర్హత మరియు ఆసక్తి గల విద్యార్థి విద్యార్థినులు ఈ నెల 9 సాయంత్రము 4 గంటల లోపు సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని కలిసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు . అందుబాటులో ఉన్న ప్రవేశాలకంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే జూలై 10న ఉదయం 10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో ప్రతిభా పరీక్ష నిర్వహించి విద్యార్థి విద్యార్థినులను ఎంపిక చేస్తామని ఒక ప్రకటనలో శ్రీమతి నారా భువనేశ్వరి తెలిపారు . అనాథ నిరుపేద బాల బాలికల కు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2005 సంవత్సరం నుంచి ఉచిత విద్య అందిస్తున్నట్టు వివరించారు .