ఘనంగా ఏబీవీపీ 74వ ఆవిర్భావ దినోత్సవం (జాతీయ విద్యార్థి దినోత్సవం


 పాడేరు,జూలై9,టుడే న్యూస్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 74వ ఆవిర్భావ దినోత్సవం పాడేరు ప్రభుత్వ మహిళల హాస్టల్ నందు నిర్వహించడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ పాoగి రామయ్య అనంతరం విశిష్ట అతిది  పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ పాoగి రామయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద స్పూర్తితో అంచెలంచెలుగా విస్తరిస్తూ 74 ఏళ్ళ ప్రస్థానంలో నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తీ వంతమైన పెద్ద విద్యార్థి సంఘoగా వెలుగొందుతుందని ఏబీవీపీ యువతలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు నింపే కర్మాగారంగా అనడంలో ఎలాంటి సందేహం లేదున్నారు కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో కూడా మేమున్నాం అంటూ విద్యార్థి పరిషత్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తరలిన కార్యకర్తలు సేవా భావం వెలకట్టలేనిది అని అన్నారు థింక్ ఇండియా, జిగ్నిస, కాళమంచ్, స్టూడెంట్ ఫర్ సేవా, మేడి విజన్, వంటి వివిధ విభాగాల ద్వారా అన్ని రంగాల విద్యార్థుల కోసం ఏబీవీపీ ముందుండి పని చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ ఎం.ఎం.ల్. పాత్రుడు, విజయనగరం విభాగ్ సంఘటన కార్యదర్శి ఉప్పర అశోక్ కుమార్, గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్, జిల్లా కన్వీనర్ రవికిరణ్ పాత్రుడు, గిరిజన విద్యార్థుల విభాగం విభాగ్ కన్వీనర్ గెమ్మెలి కళ్యాణ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అల్లంగి మహేష్, పూర్వ కార్యకర్తలు మినుముల గోపాల పాత్రుడు, పాoగి మత్స్యకొండబాబు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సత్తిబాబు, మల్లేష్, ఉపేంద్ర, రాజు, బాలు, బంగారు బాబు, విద్యార్థులు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం