డాక్ యార్డ్ ఉద్యోగులు అభినందనీయులు


సమిష్టి కృషితోనే సమస్యల పరిష్కారం

పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు

నావెల్ డాక్ యార్డ్ (కేటీబీ) ఉద్యోగులు 

అభినందనీయులని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే

గణబాబు కొనియాడారు.. ఇక్కడ కాకాని నగర్ లో ఉన్న కేటిబి ఉద్యోగుల సంఘం భవనంలో 

  విశాఖపట్నం, జూన్30,టుడే న్యూస్: గురువారము  సర్వసభ్య సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి,, డాక్ యార్డ్ లో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన  విజనగిరి భాస్కరరావు పదవీ విరమణ సందర్భంగా జరిగిన సభకు గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఉద్యోగులను ఉద్దేశించి  గణబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం లేకుండా ఉద్యోగులు సొంతంగా భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు, తాను 

శంకుస్థాపన లో పాల్గొనడం తిరిగి ప్రారంభోత్సవ సమయానికి కూడా తాను ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.. భాస్కర రావు సేవలు కొనియాడారు. సంఘం గౌరవ అధ్యక్షులు ,అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు,జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ

ఉద్యోగుల కృషితోనే సామాజిక భవనం నిర్మించుకోవడం సాధ్యమైందన్నారు.. త్వరలోనే ప్రముఖుల చేతుల మీదుగా ఈ భవనాన్ని ఉద్యోగులుకు అంకితం ఇస్తున్నట్లు  చెప్పారు. ఉద్యోగపరంగా, సంఘం కార్యదర్శిగా భాస్కరరావు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు.. డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ తోపాటు అతిథులంతా భాస్కర్ రావు దంపతులు ను ఘనంగా సన్మానించి సత్కరించారు.. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బత్తుల చిరంజీవి, చిన్నారావు, తేజ,

సన్యాసిరావు రమణ సభ్యులంతా పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం