తెలంగాణ ఉద్యమ కారుల "సన్మాణ సభ వాల్ పోస్టర్ " విడుదల.
హైదరాబాద్,జూలై13,టుడే న్యూస్: రాష్ర్ట పార్టీ కార్యాలయంలో రాష్ర్ట పార్టీ అద్యక్షులు బక్కని నర్సింహులు ని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం చేర్మేన్ తో కూడిన ప్రతినిధుల బృందం కలిసారు.ఆగస్టు 14 తేదిన హైదరాబాద్ సుందరయ్య విజ్జాన కేంద్రంలో జరగనున్నఉధ్యమ కారుల సన్మాణ సభకు హజరుకావాలని కోరారు. ఈ సందర్బంగా సభకు సంబందించిన వాల్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. వారి డిమాండ్లైన తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్దు ఏర్పాటు తో పాటు పలు డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ మద్తతు తెలపాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, కార్యాలయ కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్, రాష్ర్ట అదికార ప్రతినిది మ్యాడం రామేశ్వర్ రావు, రాష్ర్ట కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు శ్రీనివాస చారీ జహీరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.