*ఎస్.సి.ఆర్. డబ్ల్యూ.ఏ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ*




 - *భవిష్యత్ కార్యక్రమాలను వెల్లడించిన అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్*

   విశాఖపట్నం,జులై 24,టుడే న్యూస్: స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సరికొత్త పంథాలో సభ్యులకు నూతన గుర్తింపు కార్డులను  రూపొందించింది . ఈ మేరకు  ఎంవిపి ,సెక్టార్-1,ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ కార్యాలయంలో ఆదివారం ఉదయం   సీనియర్ పాత్రికేయులు ,ఎన్.యూ.జే ఉపాధ్యక్షులు నాగనబోయిన నాగేశ్వరావు చేతుల మీదుగా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు ఐడీ కార్డులను  అందజేసారు. ఈ సందర్బంగా ఎన్ఎన్ఆర్ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ నిజమైన సభ్యులను గుర్తించడానికి రెండు బార్ కోడ్ లతోకూడిన ఐడీ కార్డులను తయారు చేయడం అభినందనీయమని అన్నారు.భవిష్యత్ లో అసోసియేషన్ పేరిట మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేలా కృషి చేయాలనీ సూచించారు .  అనంతరం ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమమే ద్యేయంగా కొత్త ప్రణాళికలను రూపొందించి కార్యక్రమాలను సిద్ధం చేశామని అన్నారు .. ముఖ్యంగా  సభ్యులకు వృత్తి నైపుణ్యత పెంపొందించడానికి శిక్షణా తరగతులను ఆగస్టు నెలాఖరు లోగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు  . అలాగే ప్రతీ ఏటా  నిర్వహించే విజ్ఞాన యాత్రలు ,వినాయకచవితి ,దసరా సంబరాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు . అసోసియేషన్ కార్యక్రమాలు  దిగ్విజయంగా జరగడానికి  సహకరిస్తున్న  కార్యవర్గ మిత్రులకు  ,ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు అందిస్తున్న   సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు .  ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్ అప్పారావు ( శ్రీనివాసరావు),ఉపాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ,పద్మజ ,ఎస్.ఎన్ . నాయుడు ,కోశాధికారి ఎన్ . అశోక్ రెడ్డి ,ఆర్గనైజింగ్ సెక్రెటరీ రిషి కేశవరావు ,సహ సహాయ కార్యదర్శి కె . వినోద్ కుమార్ ,కార్యవర్గ సభ్యులు వి .సూరిబాబు ,విశ్వేశ్వరరెడ్డి ,జె .శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్