వరద ముంపు గ్రామాలలో జనసేన ఇంఛార్జి బాలకృష్ణ పర్యటన



ముమ్మిడివరం,జూలై20,టుడే న్యూస్:ముమ్మిడివరం  మండలం పొడి       తిప్పవలసల,  తిప్ప చేరులంక   గ్రామంలో గోదావరి వరద ఉదృతికి గురైన గ్రామాలను, దెబ్బతిన్న  పంటలను  జనసేన మమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ  బుధవారం పరిశీలించారు. గ్రామాల్లో బాధితుల ఇళ్ల వద్దకెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసు కున్నారు. అందుతున్న సాయంపై ఆరా తీశారు.

 రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు వరద బాధితులకు సహాయంలో పూర్తిగా విఫలం అయ్యాయని బాలకృష్ణ  అన్నారు.

గ్రామాల్లో వరద బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం 2000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా,  అవి ఎటూ సరిపోవని కనీసం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వరద ముంపుకు గురైన  నిరుపేదలైన కొండేపూడి మల్లయ్య కు  రెండు వేల రూపాయలు, సుంకర యేసు బాబుకు వెయ్యి రూపాయలు, సలాది శ్రీరాములుకు 500 రూపాయలు,  గొల్లపల్లి నాగమ్మకు  500, పాము ఈశ్వరరావుకు 500, ఉమాకు 500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. 

రైతులు పూర్తిగా నష్టపోయారని రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం