గురువుని మించిన సంపద లేదు

 

"షిరిడి సాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం"

  అక్కయ్యపాలెం, జూలై13, టుడే న్యూస్:  గురువును మించిన సంపద లేదని, అటువంటి గురువులును  గౌరవించడం పూజించడం మన కనీస ధర్మమని  అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు అన్నారు. మురళీ నగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో

గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా  రెండు రోజుల పాటు నిర్వహించిన పలు పూజాది కార్యక్రమాలకు గంట్ల శ్రీనుబాబు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శ్రీను బాబును  ఘనంగా  సత్కరించింది. అనంతరం శిరిడి సాయి నాధుని జ్ఞాపికను బహూకరించారు.. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ మురళి నగర్ షిరిడి సాయి బాబా ఆలయం ప్రతియేటా కూడా అనేక ఆధ్యాత్మిక  కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. అంతేకాకుండా విశేష పూజలు జరిపిన , దేవతా మూర్తుల  కల్యాణాలు జరిపిన ఘనత కూడా ఈ ఆలయ కమిటీకి దక్కుతుందన్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ జరుగుతున్న అనేక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం అదృష్టము గా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మురళి నగర్ షిరిడి సాయి బాబా ఆలయకమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, ప్రధాన  కార్యదర్శి  సనపల వరప్రసాద్ ,ప్రధానార్చకులు గోపి స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం