వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా


గుంటూరు : వైఎస్‌ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ప్లీనరీ సాక్షిగా ప్రకటించారు వైఎస్‌ విజయమ్మ. వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ తాను వైసిపి నుంచి తప్పుకుంటున్నట్లు  వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తుందని, తాను అండగా ఉండాలన్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం షర్మిల ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో షర్మిల గట్టి ప్రయత్నం చేస్తుందని విజయమ్మ వివరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం