విజయేంద్రప్రసాద్, ఇళయరాజాలకు నటసింహ బాలకృష్ణ అభినందనలు
అమరావతి,జూలై7,టుడే న్యూస్: రాజ్యసభకు కేంద్రప్రభుత్వంచే నామినేట్ అయిన ప్రముఖ సినీరచయిత, దర్శకుడు కెవి విజయేంద్రప్రసాద్, స్వరమాంత్రికుడు, మ్యూజిక్ డైరక్టర్ ఇళయరాజాలకు నటసింహ బాలకృష్ణ అభినందనలు తెలిపారు. తెలుగుచిత్ర పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వీరిద్దరూ పెద్దలసభకు నామినేట్ కావడం తెలుగు సినీపరిశ్రమకు గర్వకారణమని అన్నారు. తెలుగుసినిమా గొప్పతనాన్ని ఖండాంతరాలకు చేర్చిన ఘనత విజేయేంద్రప్రసాద్ కు దక్కితే... సుస్వరాలతో కేవలం తెలుగువారికేగాక దక్షిణాదిలో కోట్లాది సంగీతాభిమానులకు వీనులవిందు చేస్తున్న ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సముచితమైన నిర్ణయమని తెలిపారు. ఈ గౌరవం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవమని అంటూ వారిని ఎంపిక చేసినందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు.