డిటెక్టివ్ హర గోపాల్, అంతలో.. చిత్రాల ఫ్రీ రిలీజ్ 2న* -పోస్టర్ విడుదల చేసిన మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

 


విశాఖపట్నం, జులై 30  టుడే న్యూస్: విశాఖ కళాకారులతో రూపొందించిన డిటెక్టివ్ హర గోపాల్, అంతలో.. ఈ రెండు చిత్రాల ఫ్రీ రిలీజ్ వచ్చే నెల 2 వ తేదీన జరగనున్నదని సినీ నిర్మాత, నటుడు డా. హరగోపాల్ తెలిపారు. ఈ చిత్రాల ప్రచార వాల్ పోస్టర్ ను విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శనివారం ఉదయం జీవిఎంసి లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. హర గోపాల్ మాట్లాడుతూ సస్పెన్స్, హరర్, థ్రిల్లర్, వంటి కథాంశాలతో చిత్రీకరించిన ఈ రెండు చిత్రాలకు గీతా శ్రీ ప్రసాద్ సంగీతం తో పాటు దర్శకత్వం వహించారన్నారు. ఈ నెల 2 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఫోర్త్ టౌన్ దగ్గర వున్న సింధూర ఫంక్షన్ హాలులో ఫ్రీ రిలీజ్ జరగుతోందన్నారు. ఇందులో వివిధ సాంస్కృతిక వినోద ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసి కమీషనర్ డా. జి. లక్ష్మీశ హాజరు కానున్నట్టు నిర్మాత డా. హరగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కందుల నాగరాజు, చెన్నా జానకీరామ్, కళారంగ ప్రముఖులు చెన్నా తిరుమలరావు, ఎం. శివ జ్యోతి పాల్గొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*