ఆగష్టు 20, ఈ రోజు వి.రామకృష్ణ గారి జయంతి
ఈ గాన గాంధర్వుడిని మనం అందరం ఒక సారి స్మరించుకుంటూ ......
70 వ దశకం లో సంథి కాలం లో వున్న తెలుగు సినిమా నేపద్య సంగీతాన్ని తన గాత్రం ద్వారా కాపాడిన , ఘంటసాల గారి లేని లోటు పూడ్చి .....ఘంటసాల, బాలసుబ్రమణ్యమ్ గారి మధ్యలో వారధిలా నిలిచి తెలుగు పాటని నిలబెట్టి నిగబట్టి తారాస్థాయికి తీసుకుని వెళ్లిన ఈ మహోన్నత వ్యక్తిని తలచుట మన ధర్మం .
విస్సంరాజు రామకృష్ణ దాసు, అదేనండోయ్ మన వి.రామకృష్ణ . నిజంగా దాసుడే దేనికో తెలుసా..... పాట కి" సినిమా పాట, భక్తి పాట ఏదయినా తన గాత్ర మాధుర్యం ప్రేక్షకులని ఓలలాడిన్చాల్సిందే ......
తెలుగు సినిమా 70వ దశకం లో సినినేపధ్య గాత్రం కోసం ఎదురు చూస్తూ వుంది, ఘంటసాల మాస్టర్ గారి అనారోగ్యరీత్యా ఎక్కువగా పాటలు పాడ లేని పరిస్థితి, ఒక సమయం లో నావల్ల కాదయ్యా వేరే వాళ్ళని కాస్త చూడండి అనేంతగా ....
బాలసుబ్రహ్మణ్యం వున్నా..... లేత గొంతుక, హీరో క్రిష్ణ గారికి కొత్త గా వచ్చే కథానాయకులకు తప్ప , పెద్ద హీరోస్ కి ఆ గాత్రం నప్పదు. ఘంటసాల గారి తర్వాత వేరే గాత్రం ఊహేంచడం కష్టం. బాలు గారితో , జేసుదాస్ గారితో ప్రయత్నం చెయ్యాలని అనుకున్నా అది అంత సంతోషాన్ని ఇవ్వలేదు . ఘంటసాల మాస్టర్ గారి స్థాయి ఆశించడం కష్టమే ....... అది ఎంత వరకు వెళ్లిందంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు కలిసి కూర్చొని మాట్లాడుకునేంత గా ......... ఘంటసాల మాస్టర్ గారి తర్వాత ఎవరున్నారు అని .....
మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం గాని ఘంటసాల వారు, బాలసుబ్రమణ్యం వారు అని ........ వీరిరువురి మధ్య వారధి లా ఇంకో గాత్రం ఉండడం వల్లే తెలుగు సినిమాకి నేపధ్యగాత్రానికి లోటు లేకుండా , మనకు మరపు మెరుపు కలిగించి ఆ లోటు పూడ్చిన అద్భుత గాత్రం మన వి.రామకృష్ణ గారు.
అది ఒక " సంథి " కాలం, స్టార్ హీరోస్ కి సరిపోయే గాత్రం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వుంది. ఇంతలో ఒక ఆశ , ఎవరొనండి రామకృష్ణ అట, సుశీల గారి తాలూకా అని ఘంటసాల గారి చెవిలో మాట గా వేశారు. వెంటనే మాష్టారు సుశీలమ్మ తో ఏం అమ్మాయి గారు నాకు ఈ విషయం చెప్పలేదు అన్నారంట , సుశీల గారి కి అర్ధం కాలేదు మాస్టారు గారి మాటలు , తరువాత అడిగారంట ఏంటి మాష్టారు అని , రామకృష్ణ అంట బాగా పాడుతున్నారంట అని, మనసులో నవ్వుకున్నారు సుశీలమ్మ ఆ మాటలు విని. వెంటనే కబురు చేశారు కలవమని, వచ్చి వాలారు రామకృష్ణ గారు. ఇంకా చెప్పేదేముంది, ఒక లైన్ ఘంటసాల గారు ఇంకో లైన్ రామకృష్ణ గారు....... ఒక అద్భుతం అవిష్కృతం అయిన సందర్భం. రికార్డింగ్ ఐన తర్వాత చూస్తే పోల్చుకోలేంత దగ్గర గా వుంది, అనుకరణకు ఏ మాత్రం తావు లేకుండా తన గాత్ర మాధుర్యం తో ఒక పుష్కర కాలం ఘంటసాల మాష్టర్ లేని లోటు లేకుండా చేశారు ఈ రామకృష్ణుడు ....
ఈ విషయం ఏయన్నార్ గారికి తెలిసి కబురుపెట్టారు, గాత్రాన్ని విని మెచ్చుకున్నారు ఇంకా నుంచి తన చిత్రాలలో రామకృష్ణ గారు పాడతారు అని స్టేట్మెంటు ఇచ్చేంత గా ...... బ్రదర్ సినిమాలో రామకృష్ణ గారు పాడుతున్నారంట మనకి కూడా చుడండి అని అన్నగారు ఎన్టీఆర్ గారు కూడా ఇంకో మాట వేశారు ........ ఇంకా శోభన్ బాబు , కృష్ణంరాజు ఇలా అందరికి రామకృష్ణ గారి గాత్రమే ... శోభన్ బాబు గారైతే ఇంకో మెట్టు ఎక్కి నాకు రామకృష్ణ గారు కావాలనేంత గా ..... పాడిన ప్రతి పాట హిట్ ....
కొన్ని హిట్ సాంగ్స్
వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ
ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు
నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది......
ఇలా ఒకటి రెండా కొన్ని వేల పాటలు , సుమారు గా 5850 పాటలు సినిమా పాటలు ,భక్తి పాటలు ఇలా .... ఈ గాత్ర మాధుర్యంతో తెలుగు ప్రేక్షకులకి ఘంటసాల గారు లేని లోటు తీర్చిన సందర్భం. 80 వ దశకం లో తెలుగు తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ లోకి మారినప్పుడు, సుశీలమ్మ తో కలసి ఎన్నో ప్రైవేట్ భక్తి ఆల్బమ్స్ చేశారు రామకృష్ణ గారు.
ఎన్నో విజయవంతమైన సినిమాలకి పాడిన, ఒక సారి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది రామకృష్ణ గారికి , బాలు గారు తన గొంతుకని ఎన్టీఆర్ ఏయన్నార్ లకి దగ్గరా పాడుతూ ముందుకు దూసుకు వస్తున్నప్పుడు, కృష్ణంరాజు గారు హీరో గా వచ్చిన అమరదీపం(1977) సినిమా కోసం చెళ్ళపిళ్ళ సత్యం గారు ఒక ట్యూన్ చేశారు , నిర్మాత రామకృష్ణ గారికైతే ఈ పాట బాగుంటుంది , అది కృష్ణం రాజు గారికి బాగా నప్పుతుంది అని ...... కానీ సత్యం గారు బాలు తో ట్రాక్ తీశారు, నిర్మాత హీరో ఇద్దరు రామకృష్ణ గారు కావాలని అడిగారు, కానీ బాలు గారు ఈ పాట పాడారు అని తెలియదు. తానే ఈ పాట పాడుతున్న అని రామకృష్ణ గారు అనుకున్నారు. ట్యూన్ ని మార్చితే బాగుటుంది అని, ఈ పాటని ఇలా కాకుండా , సంగీత ప్రదాన మాధుర్యం గా పాడితే ఇంకా బాగుంటుందని ..... ఒక చిన్న సూచన చేశారు. అన్యమనస్కరంగా అంగీకరించారు సత్యం మాస్టర్. రికార్డింగ్ పూర్తయిన తరువాత సత్యం గారు ప్రొడ్యూసర్ తో, ఈ పాట భాద్యత నాది కాదు అని మొహం మీద చెప్పారు.
సినిమా రిలీజ్ అయింది, "నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది" పాట పెద్ద హిట్, ఎవరు చూసినా అదే పాట పాడుకుంటున్నారు, బిగ్గెస్ట్ రేడియో హిట్ ఆ ఇయర్ లో ....... సంగీత దర్శకుడు సత్యం గారు రామకృష్ణ ని కలసి క్షమంచు రామకృష్ణ అన్నారంట , నువ్వు సంగీత దర్శకుడవైతే బాగుంటుంది అని సూచనా కూడా చేసారంట , అలాగే గురువుగారు మీ వల్లే నాకు ఈ రోజు ఈ పేరు అని మౌనం గా సత్యం గారి ఆశీస్సులు తీసుకున్నారు మన రామకృష్ణ.....
సోదరుడు బాలు ముందుగా పాడారని తర్వాత తెలుసుకుని , బాలుని కలిసినప్పుడు తన భాదని తెలియచేసారు రామకృష్ణ. అప్పుడు బాలు గారు సోదర నాకంటే మీరు చాల బాగా పాడారు అందుకే ఆ పాట పెద్ద హిట్ అయ్యింది అన్నారు.
చివరిగా ఇంకో మాట -
sp బాలసుబ్రమణ్యం గారు కొన్ని పదుల ఇంటర్వూస్ లో ......ఘంటసాల గారి తరువాత సోదరుడు రామకృష్ణ గారి పాటలు విన్న తరువాత ఇక నాపని ఐపోయింది అని అనుకున్న, సినిమా రంగాన్ని విడిచి వెళ్ళిపోదామని ఎన్ని సార్లు అనుకున్ననో నాకే తెలియదు తెలుగు తమిళంలో ఒక 7-8 ఇయర్స్ ఐతే నన్ను ఎవరు పట్టించుకోలేదు ,ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని .....
తెలుగు తమిళం లో అవకాశాలు లేక అప్పుడు కన్నడం లో పాడేవాడిని అని చెప్పేవారు. రామకృష్ణ గారి గాత్రం నన్ను అంతలా 70వ దశకం లో బయపెట్టిందని బాలు గారు చెప్పిన సందర్భాలు అనేకం ......