విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ కుమార్తె శ్వేత వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరైన చంద్రబాబు
అమరావతి,జూలై31టుడే న్యూస్: హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), పావని దంపతుల ద్వితీయ కుమార్తె కేశినేని శ్వేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన కాజా రామనాధం మనుమడు కాజా రఘు వివాహ నిశ్చితార్థ వేడుకకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరై చిరంజీవులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రహ్మణి దంపతులు, నందమూరి వసుంధర, ఈనాడు సంస్థల అధినేతలు చెరుకూరి కిరణ్, శైలజ దంపతులు, పార్లమెంటు సభ్యులు గల్లా జయ దేవ్ , రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి సుజన చౌదరి, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల టిడిపి అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురామ్, టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రవీంద్ర కుమార్, పశ్చిమ బెంగాల్ పార్లమెంటు సభ్యురాలు మహువా మోయిత్రా, మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, టి.డి. జనార్ధన్ తదితర అగ్ర నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.