*గవర్నర్ హరి చందన్ కు రాఖీ కట్టిన చిన్నారులు*


 *నిరాడంబరంగా రాజ్ భవన్ లో రక్షాబంధన్* 

విజయవాడ, ఆగష్టు 12, టుడే న్యూస్: రక్షాబంధన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ కు చిన్నారులు రాఖీ కట్టారు. విజయవాడ రాజ్ భవన్లో అతినిరాడంబరంగా రాఖీ వేడుకను నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్ధుల వినతి మేరకు అతికొద్ది మందిని మాత్రమే రాజ్ భవన్ కు అనుమతించారు. నగరంలోని నిర్మలా ఉన్నత పాఠశాల, నల్లూరి వారి సెయింట్ మాధ్యూస్ ఉన్నత పాఠశాల, తక్షశిల ఐఎఎస్ అకాడమీకి చెందిన విద్యార్ధులు రాజ్ భవన్ కు వచ్చి గౌరవ హరించందన్ కు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గవర్నర్ చిన్నారులను పేరుపేరునా పలుకరించి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాధస్వామి ఆశీస్సులతో ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆశీర్వదించారు. గౌరవ హరిచందన్ మాట్లాడుతూ రక్షాబంధనం సోదరీ సోదరుల నడుమ ఆత్మీయతలు, అనురాగాలను ప్రతీకగా నిలుస్తుందని,  తమ అనుబంధం పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ సోదర భావంతో  జరుపుకునే ఈ వేడుక, ఒకరికి ఒకరు అండగా ఉంటామన్న భరోసాను కలిగిస్తుందని గవర్నర్ వివరించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు