*లాసన్స్ బే పార్కు కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి*


 


 *నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి* 

విశాఖపట్నం,ఆగస్టు16 టుడే న్యూస్: లాసన్స్ బే పార్కులో ఉండవలసిన సిబ్బంది కంటే తక్కువ సిబ్బందితో పని చేయిస్తూ మొత్తం బిల్లు డ్రా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె 3వ జోన్ పరిధిలో ఉన్న లాసన్స్ బే పార్క్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ నుండి ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు కాంట్రాక్టు పద్ధతిలో ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా  తీస్తూ వారి హాజరు పట్టీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్కు నిర్వహణలో జీవీఎంసీ నుండి ఇద్దరూ సిబ్బంది పని చేస్తుండగా, కాంట్రాక్టర్ నియమించిన వారు నలుగురు ఉండాల్సిన చోట గత ఐదు సంవత్సరాల నుంచి ఇద్దరే  పనిచేస్తుండడం గమనించి, సంబంధిత అధికారులపై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధిత కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఎటువంటి బిల్లులు వారికి మంజూరు చేయరాదని జేడీ (అమృత్) విజయ భారతి, జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. గత ఐదు సంవత్సరాల నుంచి పార్కుల పై దృష్టి సారించి నందున సంబంధిత అధికారులపై  అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న ప్రతి పార్కులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులు పార్కులను సందర్శించాలని ఆదేశించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం