విశాఖపట్నం,ఎన్ఎన్ఇ న్యూస్: నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమ సుందరరావు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ 112 వ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యాన ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో శనివారం జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో కవులు రచయితలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ కళా వేదికకు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ అందిస్తున్న మీడియా సహకారానికి కృతజ్ఞతగా ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆరవల్లి నరేంద్ర ఇతర ప్రతినిధులు పూలమాలవేసి దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు.
విశాఖపట్నం: టుడే న్యూస్, జనవరి:-27 పేదల వైద్యుడిగా, పోలియో వ్యాధి బాధితుల పాలిట ఆత్మబంధువుగా పేరు గాంచిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ పురస్కారం లభించడం మన తెలుగు వారందరికీ గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు ఇటివల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణరావును ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని మంత్రి కొనియాడారు. పోలియో ఆపరేషన్స్ లో వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో గర్వించే విషయమని అన్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయనకు దక్కిన పద్మ పురస్కారం మొత్తం వైద్యరంగానికే వచ్చిన గుర్తింపు అని మంత్రి అన్నారు. ఓపక్క వైద్య వృత్తితోపాటు మరోపక్క వైద్య రంగంలో విద్యార్ధులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత మంది పేద ప్రజలకు వైద్యం అందించాలని మంత్రి
*55వార్డులో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో - కె.కె రాజు అక్కయ్యపాలెం,2023 ఫిబ్రవరి 11, టుడే న్యూస్:గడ పగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు ధర్మానగర్ సచివాలయం 1086261 దర్మానగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు 55వార్డు కార్పొరేటర్ కె.వి.యన్ శశికళతో కలిసి పర్యటించారు. ముందుగా ధర్మా నగర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పిచ్చి అనంతరం ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లా ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు,వార్డు అధ్యక్షులు కె.పి రత్నాకర్,దుప్పలపూడి శ్రీనివాసరావు,డైరెక్టర్లు నూకరాజు,రాయుడు శ్రీను, 55వార్డు నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్,సొండి సురేష్,కరుణ,లక్ష