"ఘనంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి "
హైదరాబాద్, సెప్టెంబర్ 5, టుడే న్యూస్: రాష్ట్ర పార్టీ కార్యాలయంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి రాష్ర్ట పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు , పోలిట్ బ్యురో సభ్యులు రావు చంద్ర శేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ఉపాద్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హజరయ్యారు. రాష్ర్ట పార్టీ కార్యాదర్శి, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ముంజా వెంకట రాజాం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యాక్రమంలో పలు జిల్లాల నుండి ఎంపిక చేయబడిన ఉపాద్యాయులను సన్మానించి, వారికి ప్రశాంసా ప్రత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు గడ్డి పద్వావతి, అజ్మీరా రాజు నాయక్, గన్నోజు శ్రీనివాస చారీ, రాష్ర్ట అదికార ప్రతినిదులు జాజోత్ ఇందిరా, శ్రీనివాస్ నాయుడు, రాష్ర్ట కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్ర చారీ, రాష్ర్ట ఎస్సీ సెల్ అద్యక్షులు పొలంపల్లి అశోక్, చేవేళ్ల పార్లమెంట్ అద్యక్షులు సుభాష్ యాదవ్, రాష్ట్ర ఎస్.సి -సెల్ ఉపాధ్యక్షులు కత్తి తమోదాం, ప్రధాన కార్యదర్శిలు గూడెపు రాఘవులు, సంద పోగు రాశేఖర్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కసి రెడ్డి శేఖర్ రెడ్డి, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు.