జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి


*మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ని కలిసిన ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ కార్యవర్గం* 


విశాఖపట్నం,2022 సెప్టెంబర్ 23, టుడే న్యూస్:    జర్నలిస్టుల  అపరిష్కృత   సమస్యలనుపరిష్కరించడానికి చర్యలు  తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కోరారు. శుక్రవారం ఉదయం మంత్రి అమర్ నాథ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా  కలుసుకున్నారు. ఈ సందర్భంగాఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ  అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్రిడేషన్ సమస్యతో పాటుగా  హెల్త్‌ కార్డుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ సానుకూలంగా స్పందించి  జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు.జర్నలిస్టుల సాధకబాదలలో భాగస్వామ్యం అవుతూ వారికి అండగా నిలుస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను కొనియాడారు. ఈ

కార్యక్రమంలో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్), ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విజనగిరి సూరిబాబు(సూర్య), బద్ది శిరీష తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం