*టిడిపి అధినేత వస్తున్నా మీ కోసం పాదయాత్రకు 10 ఏళ్లు*


అమరావతి,2022 అక్టోబర్ 2,  టుడే న్యూస్:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2012లో చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు నేటితో 10 ఏళ్లు పూర్తి అయిన సందర్భం గా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేతను హైదరాబాద్ లోని అయన నివాసం లో కలిశారు. నాటి పాదయాత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు కేక్ కట్ చేశారు. 2012 అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభమైన వస్తున్నా మీకోసం పాదయాత్ర 208 రోజుల పాటు సాగింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 63 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబును  ఆయన నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్, గోనుగుంట్ల కోటేశ్వర రావు, చంద్రదండు ప్రకాష్ నాయుడు, ప్రకాష్ రెడ్డి, మీడియా సెక్రెటరీ  , సత్యనారాయణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం